డ్యాన్స్ బార్ లో ముంబై మునిసిపల్ కమిషనర్, అధికారుల ఎంజాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్యాన్స్ బార్ లో ముంబై మునిసిపల్ కమిషనర్, అధికారుల ఎంజాయ్!

  • దక్షిణ ముంబైలోని బార్ పై దాడి
  • మొత్తం 15 మంది అరెస్ట్ 
  • మహిళా సిబ్బందిని వదిలేశామన్న పోలీసులు
దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఓ డ్యాన్స్ బార్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలుసుకున్న పోలీసులు దాడులకు వెళ్లగా, బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)కి చెందిన పలువురు ఉన్నతాధికారులు, మందేసి, అమ్మాయిలతో చిందులు వేస్తూ పట్టుబడ్డారు. నిన్న రాత్రి ఈ దాడి జరుగగా, మొత్తం 15 మందిని అరెస్ట్ చేశామని, అందులో మునిసిపల్ కమిషనర్ స్థాయి ఉన్నతోద్యోగితో పాటు సీనియర్ ఉద్యోగులూ ఉన్నారని, బార్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

అక్కడి మహిళా సిబ్బందిని వదిలేశామని, మిగతావారిని కోర్టు ముందు హాజరు పరచగా, బెయిల్ లభించిందని వెల్లడించారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా డ్యాన్స్ బార్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. గతంలో వీటిపై ఫడ్నవీస్ సర్కారు కొరడా ఝళిపించినా, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవి మళ్లీ తెరవబడ్డాయి. డ్యాన్సర్లకు ఉపాధి ఉండదన్న కోణంలో యోచించిన కోర్టు, పలు ఆంక్షలు విధిస్తూ, వీటిని తిరిగి నడిపించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే, తీరు మారని యాజమాన్యం, బార్లలో అశ్లీల నృత్యాలు, విశృంఖలత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 
South Mumbai
Dance Bar
Police
Arrest

More Telugu News