మోదీపై పెళ్లికూతురు వ్యాఖ్యలు.. సిద్ధూకు ఈసీ క్లీన్ చిట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీపై పెళ్లికూతురు వ్యాఖ్యలు.. సిద్ధూకు ఈసీ క్లీన్ చిట్

  • ఇండోర్ ప్రచారంలో మోదీపై సిద్ధూ విమర్శలు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదన్న ఈసీ
పని చేస్తున్నట్టు నటించే కొత్త పెళ్లికూతురితో ప్రధాని మోదీని పోలుస్తూ పంజాబ్ మంత్రి సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇండోర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధూ మాట్లాడుతూ, పని తక్కువ మాటలు ఎక్కువ అనే రీతితో మోదీని ఉద్దేశించి విమర్శించారు. తక్కువ చపాతీలు చేసే పెళ్లికూతురు తన గాజుల మోతతో చుట్టుపక్కల వారికి, ఎక్కువ పని చేస్తున్నాననే భ్రమను కల్పించినట్టు మోదీ పనితీరు ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించిన ఇండోర్ ఎన్నికల కార్యాలయం సిద్ధూకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిద్ధూ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని తెలిపింది.
modi
sidhu
ec
dulhan

More Telugu News