పశ్చిమబెంగాల్లో పోటాపోటీ ప్రచారం: మోదీ ర్యాలీలు రెండు...మమత ర్యాలీలు నాలుగు!
- ఈరోజు ప్రచారం ముగుస్తుండడంతో హోరాహోరీ
- ఆధిపత్యం కోసం బీజేపీ, తృణమూల్ ప్రయత్నం
- నేటి రాత్రి పది గంటలతో ప్రచార హోరుకు తెర
ప్రధాని మోదీ మధురాపూర్, డమ్‌డమ్‌లలో ఎన్నిక ప్రచారం సాగించాలని నిర్ణయించగా, మమతా బెనర్జీ ఏకంగా నాలుగు చోట్ల రోడ్ షోలు నిర్వహణకు నిర్ణయించారు. నార్త్ 24 పరగణాలు, డైమండ్ హార్బర్, సౌత్‌వెస్ట్ పరగణాలు, కోల్‌కతాలో రోడ్‌షోలు నిర్వహించతలపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నార్త్ 24 పరగణాలలో ర్యాలీ పూర్తి చేసుకుని డైమండ్ హార్బర్ చేరుకుంటారు. ఆ తర్వాత వరుస రోడ్డు షోల్లో పాల్గొంటారు. మోదీ మధ్యాహ్నం 4.30 గంటలకు మధురాపూర్‌లోను, సాయంత్రం 6.10 గంటకు డమ్‌డమ్‌లోనూ జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు.