కోట శ్రీనివాసరావుకు, నాకు ఆ దేవుడు ఒకే రకమైన శిక్ష వేశాడు: బాబూ మోహన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోట శ్రీనివాసరావుకు, నాకు ఆ దేవుడు ఒకే రకమైన శిక్ష వేశాడు: బాబూ మోహన్

  • కోట ఇల్లు .. మా ఇల్లు పక్కపక్కనే 
  • ఇద్దరం అన్నదమ్ముల్లా ఉంటాము 
  • ఒకే కంచంలో భోజనం చేసేంత సోదరులమయ్యాము
తెలుగు తెరపై నవ్వుల సందడి చేసిన బాబూ మోహన్, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోట శ్రీనివాసరావుతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "కోట శ్రీనివాసరావుకు మొదట్లో నేనంటే కోపం వున్నా, ఆ తరువాత ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఫిల్మ్ నగర్లో పక్కపక్కనే ఇళ్లు కట్టుకున్న దగ్గర నుంచి, అన్నదమ్ముల మాదిరిగానే ఉంటున్నాము. కోట కుటుంబ సభ్యులంతా .. ఆ కుటుంబంలో ఒకడిగానే నన్ను చూసుకుంటారు. ఇప్పుడు మేము ఒక కంచంలో భోజనం చేసేంత సోదరులమయ్యాము.

ఎన్నో లక్షల మందిని నవ్వించిన మా ఇద్దరికీ 'విధి' ఒకే రకమైన శిక్ష వేసింది. కోట వారి అబ్బాయి .. మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. కోట కొడుకు ముందు బైక్ పై వెళుతుంటే .. వెనుక కార్లో భార్యాపిల్లలు వస్తున్నారు. వాళ్లు చూస్తుండగానే ఆ అబ్బాయికి ప్రమాదం జరిగింది. అలాగే మా పెద్దబ్బాయి బైక్ పై వస్తుంటే .. మా చిన్నబాబు వెనుక కార్లో వున్నాడు. చిన్నవాడు చూస్తుండగానే పెద్దాడికి ప్రమాదం జరిగింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
babu mohan
kota

More Telugu News