Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సహచర పైలట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన సీనియర్... హైదరాబాద్ రెస్టారెంట్ లో ఘటన!

  • సహచర పైలట్ ను డిన్నర్ కు పిలిచిన సీనియర్
  • వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయిన యువతి
  • విచారణ జరుపుతున్నామన్న ఉన్నతాధికారులు
ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా పైలట్ ను లైంగికంగా వేధించగా, ఆమె ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వేధింపుల ఘటన ఈ నెల 5న హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదులోని అంశాలను తెలియజేస్తూ, ఎయిర్ ఇండియా ప్రతినిధి, ఈ అంశంపై విచారిస్తున్నామని అన్నారు.

తనతో పాటు విమానంలో కో పైలట్ గా ఉండే ఓ యువతిని డిన్నర్ చేద్దామని సీనియర్ పైలట్ ఆహ్వానించాడు. అప్పటికే అతనితో కలిసి పలుమార్లు ట్రావెల్ చేసిన ఆమె, అతను మంచి వాడన్న అభిప్రాయంతో అందుకు అంగీకరించి, డిన్నర్ కు వెళ్లింది. అయితే, వెళ్లాక అక్కడ అతని మాటతీరు మారిందని, వేధింపులకు దిగాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఆ సమయంలో తన వైవాహిక జీవితంలో సంతృప్తి లేదని అతను అన్నాడు. పెళ్లి చేసుకున్నా సుఖం లేదన్నాడు. నీకు రోజూ సుఖం వద్దా? అని అడిగాడు. ఒక దశలో భర్తను వదిలి దూరంగా ఎలా ఉంటున్నావని ప్రశ్నించాడు. అతని మాటలు, ప్రశ్నలను ఎదుర్కోలేక, ఈ విషయాల గురించి మాట్లాడలేనని చెప్పి, క్యాబ్ పిలిపించుకుని వచ్చేశాను" అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Air India
Co-Pilot
Pilot
Harrasment

More Telugu News