రామోజీరావుతో చంద్రబాబు ఏకాంత సమావేశం!

  • ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫిల్మ్ సిటీకి
  • తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ!
  • మధ్యాహ్నం తరువాత తిరిగి వెళ్లనున్న ఏపీ సీఎం
కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుని, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఫిల్మ్ సిటీలోనే జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన రామోజీరావును కలిశారు. వీరిద్దరి మధ్యా చర్చల సారాంశం బయటకు వెల్లడికానప్పటికీ, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. మధ్యాహ్నం తరువాత చంద్రబాబు తిరిగి అమరావతి బయలుదేరనున్నారు.
Go Back to Shorts
Chandrababu
Ramojirao
Hyderabad

More Telugu News