ప్రపంచంలో తొలిసారి... ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ను నిషేధించిన శాన్ ఫ్రాన్సిస్కో!
- సంచలన నిర్ణయం తీసుకున్న యూఎస్ నగరం
- అమాయకుల అరెస్ట్ లు పెరిగిపోతాయన్న నిపుణులు
- నిషేధం వైపే మొగ్గు చూపిన సిటీ
ఏదైనా ఓ వీడియో క్లిప్ లేదా ఫోటోగ్రాఫ్ ను చూపితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అతని ఆనవాలును గుర్తించేదే ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్. ఈ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని, అమాయకుల అరెస్ట్ లు పెరిగిపోతాయని ఈ సమావేశంలో పాల్గొన్న అత్యధికులు అభిప్రాయపడటంతో ఈ సాఫ్ట్ వేర్ ను నిషేధించిన తొలి నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో అవతరించింది.