Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవిని వెండితెరకి నేనే పరిచయం చేశాను .. అలాంటి అమ్మాయిని నేను చూడలేదు: 'షావుకారు' జానకి

  • శ్రీదేవి తొలిసారిగా బాలసుబ్రహ్మణ్యుడి వేషం వేసింది
  •  మొదటి సారే అద్భుతంగా డైలాగ్ చెప్పింది
  •  పెద్ద స్టార్ అవుతుందని అప్పుడే అనుకున్నాను
కథానాయికగా వివిధ భాషల్లోని ప్రేక్షకులను మెప్పించిన 'షావుకారు' జానకి, ఈ మధ్య కాలంలో వచ్చిన 'కంచె' .. 'బాబు బంగారం' సినిమాల్లోను ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. "వాహిని స్టూడియోలో ఒక తమిళ సినిమా షూటింగులో వున్నాను. నిర్మాత చిన్నప్ప దేవర గారు .. 'బాల సుబ్రహ్మణ్య స్వామి' పాత్ర కోసం ఒక కుర్రాడు కావాలని నాతో చెబుతున్నారు.

శ్రీదేవి తల్లి రాజేశ్వరి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేది .. శ్రీదేవిని కూడా షూటింగ్స్ కి తీసుకొచ్చేది. చిన్నప్ప దేవరగారు నాకు ఆ మాట చెబుతున్నప్పుడు, రాజేశ్వరి నాకు కాస్త దూరంలో శ్రీదేవిని పట్టుకుని నుంచుని వుంది. అప్పుడు శ్రీదేవి వయసు ఆరేళ్లు. నేను ఆ నిర్మాతకు శ్రీదేవిని చూపిస్తూ ఆ పాపకు ఒకసారి మేకప్ వేసి చూడండి అన్నాను. ఆయన మేకప్ వేసి డైలాగ్ చెప్పమంటే అద్భుతంగా చెప్పింది. అప్పుడే ఈ అమ్మాయి పెద్ద స్టార్ అవుతుందని చెప్పాను .. అలాగే అయింది. నటన పట్ల అంతటి అంకితభావం వున్న అమ్మాయిని నేను మళ్లీ చూడలేదు" అని చెప్పుకొచ్చారు.
shavukaru janaki
ali

More Telugu News