Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాజల్ కి ఒకసారి కథ చెప్పానంతే .. ఇక నన్ను వదిలిపెట్టలేదు: దర్శకుడు తేజ

  • కాజల్ కి  సరదాగా కథ చెప్పాను
  • తనే చేస్తానని పట్టుబట్టింది
  •  ఆమె కెరియర్లో గొప్ప చిత్రమవుతుంది
కాజల్ ప్రధాన పాత్రధారిగా దర్శకుడు తేజ .. 'సీత' అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఈ కథను సిద్ధం చేసుకున్న తరువాత సరదాగా ఒకసారి కాజల్ కి వినిపించాను. అంతే .. అప్పటి నుంచి ఈ పాత్రను తనే చేస్తానంటూ పట్టుబట్టింది.

ఎప్పటికైనా ఈ సినిమా తనతో చేయవలసిందేనంటూ తేల్చి చెప్పింది. దాంతో ఏ హీరోకి కథ చెప్పినా .. ప్రధాన పాత్రధారి కాజల్ అనే చెబుతూ వచ్చాను. ఇది కథానాయిక చుట్టూ తిరిగే కథ కావడం వలన, కాజల్ వంటి సీనియర్ హీరోయిన్ జోడీ కట్టడానికి గాను కొంతమంది యువ హీరోలు వెనకడుగు వేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం .. కథ వినగానే తాను చేస్తానని చెప్పాడు. ఈ కథపై కాజల్ పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందనీ, ఆమె కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అన్నారు. 
kajal
bellamkonda

More Telugu News