Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాణిశ్రీ, శారదలతో అందుకే ఆ సినిమా చేయలేదు: దర్శకుడు సాగర్

  • వాణిశ్రీ, శారద ప్రధానంగా ఒక కథ రాసుకున్నాను
  • శారద గారు తన ఇబ్బందిని చెప్పారు
  • టైటిల్ వేరే వాళ్లకు ఇచ్చేశాను   
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సాగర్ కి మంచి పేరు వుంది. ఎన్నో భారీ విజయాలు ఆయన ఖాతాలో వున్నాయి. అలాంటి సాగర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "ఒకసారి నేను 'ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు' అనే టైటిల్ తో సినిమా చేయాలనుకున్నాను. కథ సిద్ధం చేసుకుని .. అత్తల పాత్రలకి వాణిశ్రీ, శారద అయితే బాగుంటుందని వాళ్లను సంప్రదించాను. ఇద్దరితోను నాకు మంచి అనుబంధం వుంది.

 ఈ సినిమా చేయడానికి వాణిశ్రీగారు వెంటనే అంగీకరించడంతో శారదగారిని కలిశాను. అప్పుడు శారద గారు " ఈ సినిమా చేయాలని నాకూ వుంది .. కానీ మా ఇద్దరి కాస్ట్యూమ్స్ విషయంలో ఈగోలు దెబ్బతినే అవకాశం వుంది. అంతేకాదు ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ వున్నప్పుడు, 'షాట్ రెడీ' అనగానే నేను కెమెరా ముందుకు వచ్చేస్తాను .. కానీ ఆమె రాదు. దాంతో నాకు కోపం వస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి .. వినే ఓపిక వుంటే చెబుతాను" అన్నారు. దాంతో ఆ ఇద్దరితో సినిమా చేసే ఆలోచన విరమించుకుని, టైటిల్ మాత్రం వేరే వాళ్లకు ఇచ్చేశాను" అని చెప్పుకొచ్చారు.
sagara
vanisri
sharada

More Telugu News