కాస్తంత మోడ్రన్ లుక్ తో ఇట్టే ఆకట్టుకుంటున్న ఎన్నికల అధికారిణి... ఆమె ఎవరో తెలిసింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాస్తంత మోడ్రన్ లుక్ తో ఇట్టే ఆకట్టుకుంటున్న ఎన్నికల అధికారిణి... ఆమె ఎవరో తెలిసింది!

  • లేత పసుపు రంగు చీరలో అదిరిపోయిన రీనా ద్వివేది
  • వైరల్ అయిన చిత్రాలు
  • తనకు కాస్తంత ఇబ్బందిగానే ఉందన్న రీనా
లేత ప‌సుపు రంగు చీర, మ్యాచింగ్ స్లీవ్‌ లెస్ జాకెట్, క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, జారవిడిచిన కురులతో, ఓ చేత్తో సెల్ ఫోన్, మరో చేత్తో ఈవీఎంను పట్టుకుని, ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న ఓ ఎన్నికల అధికారిణి ఫోటోలు వైరల్ కావడంతో, ఆమె ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు నానా తంటాలూ పడ్డారు.

ఎన్నికల విధులకు ఆమె వెళుతున్న వేళ, తుషార్‌ రాయ్‌ అనే ఫొటో జర్నలిస్ట్‌ ఆమె చిత్రాలను తీశారు. టాప్ మోడల్స్ ను తలదన్నేలా ఉన్న ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేశారు. ఈలోగా ఆమె జైపూర్ లో విధులకు వచ్చారని, ఆమె పనిచేసిన బూత్ లో 100 శాతం ఓటింగ్ నమోదైందని వార్తలు పుకార్లు చేశాయి. ఇక ఈమె ఎవరో కూడా తేల్చేశారు. ఆమె పేరు రీనా ద్వివేది అని, లక్నో, పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్నారని కనిపెట్టేశారు.

ఇక రాత్రికిరాత్రే తాను ఓ సెలబ్రిటీగా మారడంపై రీనా స్పందించారు. ఈ నెల 5న తనకు లక్నోలోని 173వ నంబర్ బూత్ లో డ్యూటీ పడిందని, అప్పుడు ఈ ఫోటోలు తీశారని, ఇవి వైరల్ కావడంతో తనతో సెల్ఫీలు కావాలంటూ ఎంతో మంది అడుగుతున్నారని, ఇది తనకు కాస్తంత పాజిటివ్ గా, మరికొంత నెగటివ్ గా అనిపిస్తోందని చెప్పారు. తాను పని చేసిన బూత్ లో 100 శాతం పోలింగ్ అవాస్తవమని, కేవలం 70 శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని తెలిపారు.


Reena Dwivedi
Elections
Officer
Lucknow

More Telugu News