హెలికాప్టర్ డోర్ ను రిపేర్ చేయడంలో పైలట్ కి సాయం చేసిన రాహుల్ గాంధీ!
- హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో ఘటన
- హెలికాప్టర్ డోర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య
- సంబంధిత ఫొటో వైరల్
ఈ సందర్భంగా హెలికాప్టర్ డోర్ విషయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ కి సహాయకారిగా రాహుల్ కూడా రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మంచి టీం వర్క్ అంటే అన్ని చేతులు కలిసి పనిచేయడమే. ఉనా పర్యటన సమయంలో మా హెలికాప్టర్లో సమస్య ఎదురైంది. మేమంతా కలిసి దాన్ని త్వరగా సరిచేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు’ అని రాహుల్ తెలిపారు. టీం వర్క్‌తో ఏదైనా సాధించగలమని వ్యాఖ్యానించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.