పెళ్లి బట్టలతోనే అలీ షూటింగుకి వచ్చేశాడు: 'గబ్బర్ సింగ్' కమెడియన్ ఆంజనేయులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి బట్టలతోనే అలీ షూటింగుకి వచ్చేశాడు: 'గబ్బర్ సింగ్' కమెడియన్ ఆంజనేయులు

  • రూమ్ ఇచ్చినా భోజనానికి సుధాకర్ ఇంటికి వెళ్లారు 
  • షూటింగు ఆలస్యం కావడంతో కోప్పడిన రాఘవేంద్రరావుగారు
  • సుధాకర్ కి బదులుగా అలీని తీసుకున్నారు   
'గబ్బర్ సింగ్' సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ ను ఎవరూ కూడా అంత తేలికగా మరిచిపోలేరు. అంతగా ఆ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆ బృందంలో హీరో రాజశేఖర్ ను అనుకరిస్తూ మంచి మార్కులు కొట్టేసిన ఆర్టిస్ట్ పేరే ఆంజనేయులు. అంతకుముందు నుంచే ఆయన సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ అంత్యాక్షరీ ఎపిసోడ్ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అలీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

'అన్నపూర్ణ స్టూడియోలో రాఘవేంద్రరావుగారు .. వెంకటేశ్ హీరోగా 'ముద్దుల ప్రియుడు' సినిమా షూటింగు చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్రను కమెడియన్ సుధాకర్ గారు చేస్తున్నారు. లంచ్ బ్రేక్ కి ఇంటికి వెళ్లిన సుధాకర్ గారు ఆలస్యంగా వచ్చారు. రూమ్ ఇస్తే ఇంటికి ఎందుకు వెళ్లారంటూ రాఘవేంద్రరావుగారు కోప్పడటం .. సుధాకర్ ను తప్పించి అలీకి కాల్ చేయించడం జరిగిపోయాయి. ఆ రోజు రాత్రి రాజమండ్రిలో అలీ పెళ్లి జరుగుతోంది. పెళ్లితంతు పూర్తి కాగానే అవే బట్టలతో అక్కడే కారు ఎక్కేసి పొద్దుటే అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేసిన అలీ .. షూటింగులో పాల్గొన్నాడు" అని చెప్పుకొచ్చాడు. 
anjaneyulu

More Telugu News