Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్'లో రచ్చరవి కనిపించకపోవడానికి కారణమదే: సత్తిపండు

  • పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
  • కొంతకాలంగా షోలో కనిపించని రచ్చరవి
  •  సినిమాలపై దృష్టి పెట్టడమే కారణమన్న సత్తిపండు 
'జబర్దస్త్' కామెడీ షో ఎంతో పాప్యులర్ అయింది. ఈ కామెడీ షో ఎంతోమంది నటులకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అలా ఈ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో 'రచ్చరవి' ఒకరుగా కనిపిస్తాడు. అయితే కొంతకాలంగా రచ్చరవి ఈ స్టేజ్ పై కనిపించడం లేదు. దాంతో కావాలనే ఆయనను తప్పించారనే ప్రచారం జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని గురించిన ప్రశ్న సత్తిపండుకి ఎదురైంది.

అందుకు సత్తిపండు స్పందిస్తూ .. "రచ్చరవిని ఎవరో తొక్కేశారనడంలో ఎంతమాత్రం నిజం లేదు. అసలు అక్కడ అలాంటి ఆలోచనలు .. గొడవలు ఉండనే వుండవు. నిజం చెప్పాలంటే అక్కడ నాకు ఎవరూ బంధువులు లేరు. నాలో టాలెంట్ ఉండటం వల్లనే నన్ను ప్రోత్సహిస్తున్నారు. రచ్చరవికి ఆ మధ్య వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందువలన ఆయన వాటిపైనే దృష్టి పెట్టాడు. అంతే తప్ప మరో కారణమేదీ లేదు" అని చెప్పుకొచ్చాడు. 
satthipandu

More Telugu News