హృతిక్ అంత పెద్ద విషాద‌క‌ర‌మైన స్టోరీ ఎందుకు రాశారో?: కంగన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హృతిక్ అంత పెద్ద విషాద‌క‌ర‌మైన స్టోరీ ఎందుకు రాశారో?: కంగన

  • తన సినిమా విడుదలను వాయిదా వేయించిన హృతిక్
  • కొన్నేళ్లుగా కంగన టార్చర్ పెడుతోందంటూ ఆవేదన
  • సోలో రిలీజ్ డేట్ దొరికినందుకు సంతోషంగా ఉందన్న కంగన
ఒకప్పుడు ప్రేమికులైన హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లు ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయారు. బహిరంగంగా విమర్శించుకుంటూ ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కారు. జూలై 26 వీరి మధ్య మరోసారి చిచ్చు పెట్టింది. కంగన నటించిన 'మెంటల్ హై క్యా', హృతిక్ నటించిన 'సూపర్ 30' చిత్రాలు ఆరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, హృతిక్ ను ఉద్దేశిస్తూ కంగన సోదరి రంగోలి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో, విడుదల తేదీని హృతిక్ పోస్ట్ పోన్ చేశాడు. అంతేకాదు, కొన్నేళ్లుగా తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, మీడియా కూడా వారికే సపోర్ట్ చేస్తోందని, అందుకే తన సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలను కోరానని చెప్పాడు.

ఈ నేపథ్యంలో కంగన స్పందిస్తూ, అంత పెద్ద విషాదకరమైన స్టోరీని హృతిక్ ఎందుకు రాశాడో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేసింది. తన సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. పురుషాధిక్య ప్రపంచంలో విజయం సాధించిన నిర్మాత ఏక్తా కపూర్ నిజంగా గ్రేట్ అని కితాబిచ్చింది. 'మెంటల్ హై క్యా' చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ అనే విషయం తెలిసిందే.
hrithik roshan
kangana ranaut
bollywood

More Telugu News