ఇదో రకం నిరసన: షోరూం ముందే స్మార్ట్‌ ఫోన్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇదో రకం నిరసన: షోరూం ముందే స్మార్ట్‌ ఫోన్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు

  • కొత్త ఫోన్‌ సరిగా పనిచేయడం లేదని కోపం
  • షాపు సిబ్బంది సరిగా స్పందించడం లేదని ఆగ్రహం
  • షాపు ముందే రోడ్డుపై పడేసి దగ్ధం చేసిన వైనం
ముచ్చటపడి కొనుక్కున్న ఖరీదైన సెల్ ఫోన్‌ రోజులు గడవక ముందే మొరాయిస్తుండడం, షాపు సిబ్బందిని అడిగితే సర్వీస్‌ సెంటర్‌కి వెళ్లాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కోపం తట్టుకోలేకపోయిన ఆ వ్యక్తి షాపు ముందే రోడ్డుపై ఫోన్‌ పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించేశాడు.

వివరాల్లోకి వెళితే చెన్నైకి చెందిన తలైమలై అనే వ్యక్తి నగర శివారు క్రోంపేటలోని ఓ ప్రైవేటు షోరూంలో ఖరీదైన సెల్‌ ఫోన్‌ కొద్ది రోజు క్రితం కొనుగోలు చేశాడు. కానీ అది సరిగా పనిచేయక పోవడంతో ఫోన్‌ కొన్న షాపులోకి వెళ్లి సిబ్బందికి సమస్య తెలియజేశాడు. సిబ్బంది సరిగా స్పందించ లేదు సరికదా సర్వీస్‌ సెంటర్‌కో, సెల్‌ఫోన్‌ తయారీ సంస్థకో వెళ్లి అడగాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో షోరూం నుంచి బయటకు వచ్చి పోన్‌ను షాపు ఎదురుగా రోడ్డు మీద పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ విధంగా తన నిరసన తెలియజేశాడు.
chenni
cellphone
fire

More Telugu News