'మొగలి రేకులు' సీరియల్ నుంచి మధ్యలో తప్పుకోవడానికి కారణమదే: నటుడు ఇంద్రనీల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మొగలి రేకులు' సీరియల్ నుంచి మధ్యలో తప్పుకోవడానికి కారణమదే: నటుడు ఇంద్రనీల్

  • 'మొగలిరేకులు'లో నా పాత్ర ప్రాధాన్యం తగ్గించారు
  •  కొంతమంది వలన అలా జరిగింది
  •  మనసుకి కష్టం కలగడంతో మానేశాను
'చక్రవాకం' .. 'మొగలి రేకులు' వంటి సీరియల్స్ ఇంద్రనీల్ కి మంచి పేరును తెచ్చిపెట్టాయి. 'మొగలి రేకులు' సీరియల్ నుంచి ఆయన మధ్యలోనే తప్పుకున్నాడు. అందుకు కారణమేమిటనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. 'మొగలి రేకులు' ధారావాహికలో నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అంత ప్రాధాన్యత కలిగి ఉండటం వల్లనే ఆ సీరియల్ చేయడానికి నేను అంగీకరించాను.

కానీ రాన్రాను ఆ పాత్ర ప్రాధాన్యత తగ్గుతూ వెళ్లడం నేను గమనించాను. నా పాత్ర విషయంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే వచ్చాను. కొంతమంది వలన నా పాత్ర డల్ అవుతూ ఉందనే విషయం నాకు అర్థమైంది. చివరికి నాకు ఇష్టం లేకపోవడం వలన, తప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది" అని చెప్పుకొచ్చాడు.
indraneel

More Telugu News