టీవీ9 రవిప్రకాశ్ కు మరోసారి నోటీసులు పంపే అవకాశం... ఇప్పటివరకు విచారణకు హాజరుకాని వైనం!

  • నటుడు శివాజీ కూడా విచారణకు గైర్హాజరు
  • పోలీసుల ఎదుట హాజరైన టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్
  • సాయంత్రం వరకు వేచిచూడనున్న పోలీసులు!
ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 సీఈవో రవిప్రకాశ్ కు మరోసారి నోటీసులు పంపాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫోర్జరీ, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఆయనకు గురువారం  సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. టీవీ9 చానల్ ను కొనుగోలు చేసిన అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్, నటుడు శివాజీల ఇళ్లలో సోదాలు చేశారు. రవిప్రకాశ్, శివాజీలతో పాటు టీవీ9 చానల్ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ మూర్తికి కూడా విచారణకు రమ్మంటూ నోటీసులు ఇచ్చారు.

అయితే, ఇవాళ ఉదయం మూర్తి ఒక్కరే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాగా, రవిప్రకాశ్, శివాజీ ఇప్పటివరకు హాజరుకాలేదు. దీనిపై, పోలీసులు మరోసారి రవిప్రకాశ్, శివాజీలకు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో పోలీసులు నేటి సాయంత్రం వరకు వేచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
TV9
Police
Hyderabad

More Telugu News