వాళ్ల టార్చర్ తట్టుకోలేక సినిమా విడుదలను వాయిదా వేయించా: హృతిక్ రోషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాళ్ల టార్చర్ తట్టుకోలేక సినిమా విడుదలను వాయిదా వేయించా: హృతిక్ రోషన్

  • ఒకే రోజు విడుదల కావాల్సి ఉన్న హృతిక్, కంగనాల సినిమాలు
  • చాలా కాలంగా ఇద్దరి మధ్య గొడవలు
  • సినిమా విడుదలను వాయిదా వేసిన హృతిక్
బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒకరినొకరు విమర్శించుకుంటూ ఇద్దరూ కొన్నాళ్ల పాటు వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగినా... మళ్లీ సినిమా విడుదల విషయంలో గొడవ మొదలైంది. హృతిక్ నటించిన 'సూపర్ 30', కంగనా నటించిన 'మెంటల్ హై క్యా' చిత్రాలు ఒకే రోజున విడుదలవుతున్నాయి.

దీంతో విడుదల తేదీని మార్చుదామని కంగనను నిర్మాత ఏక్తా కపూర్ కోరగా... దానికి ఆమె ఒప్పుకోలేదు. మరోవైపు, 'చూస్తూ ఉండు... కంగన చేతిలో నీ పని అయిపోయింది' అంటూ ట్విట్టర్ వేదికగా హృతిక్ ను కంగనా సోదరి రంగోలీ హెచ్చరించింది. ఈ బెదిరింపులపై హృతిక్ స్పందించాడు. అనవసరమైన టార్చర్ ను తట్టుకోలేక తన సినిమా 'సూపర్ 30' విడుదలను వాయిదా వేయించానని చెప్పాడు. నా సినిమాకు ఎలాంటి హాని జరగకూడదనే విడుదల తేదీలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన నిర్ణయాన్ని నిర్మాతలు గౌరవించారని చెప్పాడు. కొన్నేళ్లుగా తనను వేధిస్తున్న వారిని కొందరు ప్రోత్సహిస్తున్నారని అన్నాడు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు ముగింపు పలకాలని కంగన, రంగోలీలను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.  
hrithik
kangana
bollywood

More Telugu News