తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా సన్నాహాలు

  • జూన్ 2 ‘తెలంగాణ’ అవతరణ దినోత్సవం
  • పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు
  • తెలంగాణ సీఎస్ జోషి ఆదేశాలు
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలంగాణ సీఎస్ జోషి చెప్పారు. మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పాల్గొనేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని, హైకోర్టు, చార్మినార్ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూన్ రెండో తేదీన ట్యాంక్ బండ్ వద్ద డ్రోన్ ల ప్రదర్శన, మూడో తేదీన ఎల్బీ స్టేడియంలో 1001మంది కళాకారులతో మహానృత్య ప్రదర్శన, నాల్గో తేదీన 5 వేల మంది కళాకారులతో ఒగ్గుడోలు మహా విన్యాసం నిర్వహిస్తామని చెప్పారు. కళాకారులచే పీపుల్స్ ప్లాజా, రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని జోషి పేర్కొన్నారు.
Go Back to Shorts
Telangana
cs
joshi
charminar
raj bhavan

More Telugu News