సల్మాన్ ఖాన్ వల్లనే నా పేరు మార్చుకున్నాను: కైరా అద్వాని
- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కైరా
- వరుస సినిమాలతో ఫుల్ బిజీ
- నా అసలు పేరు 'అలియా అద్వాని'
"నా అసలు పేరు కైరా అద్వాని కాదు .. అలియా అద్వాని. 'ఆల్రెడీ ఇండస్ట్రీలో అలియా భట్ వుంది. అందువలన 'అలియా'తో మొదలయ్యే మరో పేరుతో ఇండస్ట్రీలో కొనసాగడం అంత కరెక్ట్ కాదు. నా మాట విని వెంటనే పేరు మార్చుకో' అని సల్మాన్ సలహా ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమేనని అనిపించడంతో నా పేరును 'కైరా అద్వాని'గా మార్చుకున్నాను. మా అమ్మానాన్న కూడా నన్ను ఇప్పుడు ఇదే పేరుతో పిలుస్తున్నారు" అని చెప్పుకొచ్చింది.