టీవీ9 రవిప్రకాశ్ భార్య, హీరో శివాజీలకు నోటీసులు అందించిన పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ9 రవిప్రకాశ్ భార్య, హీరో శివాజీలకు నోటీసులు అందించిన పోలీసులు

  • రవి ప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదు
  • రేపు పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులు
  • టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్కుల స్వాధీనం
సంతకాలు ఫోర్జరీ చేసినట్టు టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఎక్కడున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో, రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన భార్యకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు.

 మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి హీరో శివాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఈ సాయంత్రం పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ravi prakash
tv9
sivaji
wife
notice

More Telugu News