'అన్నమయ్య' ప్రివ్యూ చూసి అంతా ఏడ్చేశారు: దర్శకుడు రాఘవేంద్రరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అన్నమయ్య' ప్రివ్యూ చూసి అంతా ఏడ్చేశారు: దర్శకుడు రాఘవేంద్రరావు

  • నిర్మాతలు నష్టపోకూడదనే ఆలోచిస్తాను
  • 'అన్నమయ్య' తీస్తుండగా రమ్యకృష్ణ అలా అంది
  •  క్లైమాక్స్ కి నేను ఆశించిన రెస్పాన్స్ వచ్చింది
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన భక్తి చిత్రాలలో 'అన్నమయ్య' ముందువరుసలో కనిపిస్తుంది. తాజా ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, "భక్తి చిత్రాలే అయినా అవి అవార్డు సినిమాలుగా వుండాలని నేను అనుకోను. నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తాను. అందుకే నా సినిమాల్లో కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా చూసుకుంటాను.

'అన్నమయ్య' సినిమాను తీసేటప్పుడు .. 'ఈ టైములో భక్తి సినిమా ఎందుకండీ .. వున్న ఇమేజ్ పోతుందేమో' అని రమ్యకృష్ణ అంది. ఈ సినిమా ప్రివ్యూకి చాలామందిని పిలిచాము. ప్రివ్యూ చూసిన తరువాత .. అందరూ నా దగ్గరికి వరుసగా వచ్చి గట్టిగా కౌగలించుకుని ఏడ్చారు. క్లైమాక్స్ చూసిన తరువాత థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ చూడాలని నేను షూటింగు రోజున అనుకున్నానో, అలాంటి రెస్పాన్స్ ను ప్రివ్యూ రోజునే చూసినందుకు ఆనందం వేసింది" అని చెప్పుకొచ్చారు. 
raghavendra rao

More Telugu News