అగ్నిగుండంలా ప్రకాశం జిల్లా... త్రిపురాంతకంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- రాష్ట్రంపై సూర్యుడి ప్రతాపం
- ఫణి తుపాను అనంతరం ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు
- ఎండలకు తోడు వడగాడ్పులతో ప్రజలు విలవిల
సాధారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుంటాయి. అయితే ఫణి తుపాను నేపథ్యంలో వాతావరణంలో పెనుమార్పులు వచ్చాయి. నడివేసవిలో వచ్చిన ఈ పెనుతుపాను వాతావరణంలోని తేమనంతటినీ తనతో పాటు తీసుకెళ్లింది. తద్వారా రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడడమే కాకుండా ఎండ వేడిమి ఒక్కసారిగా పెరిగిపోయింది. 40 డిగ్రీలకు అటూఇటూగా ఉన్న ఉష్ణోగ్రతలు ఏకబిగిన 45 డిగ్రీలకు పైన నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఎండలకు తోడు పశ్చిమ దిక్కు నుంచి వీస్తున్న వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.