Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్, ఏఎన్నార్ లను ఢీ కొట్టాను.. నా బయోపిక్ తీయడమంటే సాహసమే!: సీనియర్ హీరోయిన్ జమున

  • నేను ఒక చరిత్ర సృష్టించాను
  • రాజకీయాల్లోను సక్సెస్ అయ్యాను
  • నా వంటి నటి దొరకడం కష్టమే     
తెలుగు తెరపై సావిత్రి .. జమున ఇద్దరూ కూడా తిరుగులేని కథానాయికలుగా ఒక వెలుగు వెలిగారు. సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో జమున బయోపిక్ కూడా తీసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఇదే విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో జమున ప్రస్తావిస్తూ .. "నా బయోపిక్ తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే జమున అంటే పొగరుబోతు .. ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి హీరోలను ఢీ కొట్టింది. మూడేళ్లు నాతో వాళ్లు సినిమాలు చేయకపోయినా .. పొమ్మంది. రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యాను. ఒక గృహిణిగా కూడా మంచి జీవితాన్ని చూశాను. ఇలా అన్ని కోణాల్లోను జమున ఒక చరిత్ర సృష్టించింది. అలాంటి నా బయోపిక్ తీయడమంటే సాహసమే అవుతుంది. ఈ జనరేషన్ లో నా బయోపిక్ లో నా పాత్ర చేసే నటి దొరకడం కూడా కష్టమే" అంటూ చెప్పుకొచ్చారు.
jamuna

More Telugu News