అందుకే మళ్లీ పెళ్లి ఆలోచన చేయలేదు: నటి రాగిణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే మళ్లీ పెళ్లి ఆలోచన చేయలేదు: నటి రాగిణి

  • అక్కయ్యల పెళ్లిళ్లు .. కష్టాలు చూశాను 
  • నా భర్త వదిలేసి వెళ్లిపోయాడు
  •  పెళ్లి విషయంలో ఇక నా నిర్ణయం మారదు
నటిగా మంచి పేరు తెచ్చుకున్న రాగిణి, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "జీవితంలో ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చాను. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను మాత్రం రానివ్వలేదు. పెళ్లి చేసుకుంటే ఉన్నవాళ్లతో పాటు భర్తను కూడా పోషించవలసి వస్తుంది .. నేనున్న పరిస్థితుల్లో నాకు మళ్లీ పెళ్లి అవసరమా? అనిపించింది.

అక్కయ్యలు .. పెళ్లి చేసుకుని వాళ్లు పడిన కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఇక నాకు ఉండవలసిన అనుభవం వుండనే వుంది. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తమని పెళ్లి చేసుకోమని అడిగినవాళ్లు చాలామందే వున్నారు. వాళ్ల మాటలను నేను సీరియస్ గా తీసుకోలేదు. నా మనసు మార్చుకోలేదు. ఈ జన్మకు ఇంతే .. వచ్చే జన్మంటూ వుంటే అప్పుడు చూద్దాం" అంటూ చెప్పుకొచ్చారు.
ragini

More Telugu News