మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,750, విశాఖపట్నంలో రూ.32,670, ప్రొద్దుటూరులో రూ.32,760, చెన్నైలో రూ.31,730గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,250, విశాఖపట్నంలో రూ.30,050, ప్రొద్దుటూరులో రూ.30,370, చెన్నైలో రూ.30,220గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,300, విశాఖపట్నంలో రూ.38,100, ప్రొద్దుటూరులో రూ.38,200, చెన్నైలో రూ.40,200 వద్ద ముగిసింది.