మా నాన్నని బతికించుకోలేకపోతే ఈ డబ్బెందుకు అనుకున్నాను: వీవీ వినాయక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా నాన్నని బతికించుకోలేకపోతే ఈ డబ్బెందుకు అనుకున్నాను: వీవీ వినాయక్

  • మా నాన్నకి కేన్సర్ అని తెలిసి షాక్ అయ్యాను 
  • విదేశాలకి తీసుకెళ్లి వైద్యం చేయించాను 
  • చుట్టలు తాగడంతో కేన్సర్ తిరగబెట్టేసింది
తెలుగులో మాస్ ఆడియన్స్ ను మెప్పించే దర్శకుల జాబితాలో వీవీ వినాయక్ పేరు మొదటివరుసలో కనిపిస్తుంది. అగ్రదర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటోన్న ఆయన, తాజా ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ప్రస్తావించారు. కేన్సర్ అనేది ఆయనను తమ నుంచి దూరం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

"మా నాన్నకి కేన్సర్ వచ్చిందనే విషయం తెలియగానే మేమంతా షాక్ కి గురయ్యాము. ఆ చేదు నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. మా నాన్నని బతికించుకోలేకపోతే ఈ డబ్బెందుకు? .. ఈ పేరెందుకు? అనుకున్నాను. లండన్ నుంచి ఒక పెద్ద డాక్టర్ ను రప్పించాను. ఆయన మా నాన్న పరిస్థితిని చూసి కాపాడటం కష్టమేనని చెప్పారు. జపాన్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉందని తెలిసి అక్కడికి తీసుకెళ్లాను. ట్రీట్మెంట్ తరువాత ఇంటికి వచ్చాక ఆయన బాగానే ఉండటం చూసి సంతోష పడ్డాము. కానీ ఆయన మాకు తెలియకుండగా చుట్టలు తాగడం వలన, కేన్సర్ తిరగబెట్టి చనిపోయారు" అని చెప్పుకొచ్చారు.
vinayak

More Telugu News