మోదీ మానసిక స్థితి బాగోలేదు, మంచి ఆసుపత్రికి తీసుకెళ్లాలి: ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్

  • సరిగా నిద్రలేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
  • మోదీ విషయంలో కూడా అదే జరిగింది
  • అందుకే, రాజీవ్ గాంధీపై వ్యాఖ్యలు చేస్తున్నారు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా తన జీవితాన్ని ముగించారని పీఎం మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా, మోదీపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ విరుచుకుపడ్డారు. సరిగా నిద్రలేని వాళ్లు మానసిక అనారోగ్యానికి గురువుతుంటారని, మోదీ విషయంలో కూడా అదే జరిగిందని, అందుకే, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లయిందని, ఆయన గురించి ఇప్పుడు మాట్లాడడమేంటని ప్రశ్నించారు. మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే మోదీ మానసిక స్థితి బాగోలేదని, మంచి ఆసుపత్రికి ఆయన్ని తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
pm
modi
chatisgarh
cm
bhupesh baghel

More Telugu News