వెంకట్రావ్.. నీ భార్య నీమీద వరకట్నం వేధింపుల కేసు పెట్టలేదా?: వల్లభనేని వంశీ
- ఆయనపై ఎస్సీ,ఎస్టీ కేసులున్నాయి
- వైసీపీ నేతలంతా అల్లరిమూకలు
- తెల్లదుస్తులు వేసుకోగానే నాయకులు అయిపోరు
విజయవాడలో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడారు. వైసీపీ నేతలంతా అల్లరిమూకలనీ, వారి ఆలోచనావిధానం అలాగే ఉంటుందన్నారు. ఇండిపెండెంట్ల చేతిలో ఓడిపోయిన వ్యక్తుల రాజకీయాలు ఇలాగే ఉంటాయని వెంకట్రావును దెప్పిపొడిచారు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పెద్ద మనుషులు అయిపోరని స్పష్టం చేశారు.