నేను పాట షూటింగులో ఉండగా అమ్మ చనిపోయింది: నటి రక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను పాట షూటింగులో ఉండగా అమ్మ చనిపోయింది: నటి రక్ష

  • అమ్మ కేన్సర్ తో బాధపడుతోంది 
  • ఆ సమయంలో సినిమాలతో నేను బిజీ
  • అమ్మ దగ్గర ఉండలేకపోయినందుకే బాధ  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'రక్ష' మాట్లాడుతూ, తన తల్లిని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. "అమ్మ అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. అలాగే మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. నన్ను పెద్ద హీరోయిన్ గా చూడాలని అనుకుంది. 1997లో నేను  హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్నాను. ఆ సమయంలో అమ్మకి కేన్సర్ అనే విషయం బయటపడింది. కేన్సర్ చివరి స్టేజ్ లో ఉండగా బయటపడటంతో ఏమీ చేయలేకపోయాము.

 కేన్సర్ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆమె చాలా భయపడుతూ ఉండేది. అందువలన నేను చెన్నై నుంచి ఉదయం ఫ్లైట్ కి హైదరాబాద్ వచ్చేసి షూటింగు చూసుకుని, సాయంత్రానికి తిరిగి చెన్నై వెళ్లిపోయేదానిని. ఒక రోజున హైదరాబాద్ లో జగపతిబాబుగారితో కలిసి షూటింగులో ఉండగా, అమ్మకి సీరియస్ గా ఉందంటూ ఇంటి నుంచి కాల్ వచ్చింది. దాంతో నేను ఉన్నపళంగా బయల్దేరి చెన్నై వెళ్లాను. అమ్మ చనిపోయిందని తెలిసి కుప్పకూలిపోయాను. చివరి సమయంలో ఆమె పక్కన లేకపోయానే అనే బాధ నన్ను వెంటాడుతూ ఉంటుంది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
raksha

More Telugu News