ఎన్నికల కోడ్ ను అనుసరించే ఏపీ కేబినెట్ భేటీ: ద్వివేది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల కోడ్ ను అనుసరించే ఏపీ కేబినెట్ భేటీ: ద్వివేది

  • నాయకులు, అధికారులు కోడ్ ను అనుసరించాలి
  • ఇప్పటికే అందరికీ కోడ్ ఆఫ్ కండక్ట్ పుస్తకాలు పంపాం
  • ఈ పుస్తకాల్లో అన్ని వివరాలు ఉన్నాయి
ఈ నెల 10న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఎన్నికల కోడ్ కు లోబడే కేబినెట్ సమావేశం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నాయకులు, అధికారులు అందరూ ఎన్నికల కోడ్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పారు. ఇప్పటికే అన్ని పార్టీలకు, అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పుస్తకాలు పంపామని తెలిపారు. ఈ పుస్తకాల్లో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. ఏవైనా అనుమానాలు ఉంటే సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
dwivedi
ceo
ap
cabinet meeting

More Telugu News