చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు.. సుప్రీం కర్రు కాల్చి వాత పెట్టింది!: విజయసాయిరెడ్డి

  • 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపు కుదరదని సుప్రీం చెప్పింది
  • కోర్టు తీర్పును తప్పుపట్టేలా బాబు మాట్లాడారు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రస్తుతం మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని విమర్శించారు. ఈరోజు ఆయన సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలన్న ఆయన డిమాండ్ ను సుప్రీం తిరస్కరించిందన్నారు. ఈరోజు మళ్లీ కోర్టుకు వెళితే కర్రు కాల్చి వాత పెట్టిందని ఎద్దేవా చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. అన్ని వీవీప్యాట్లను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కానీ చంద్రబాబు కోర్టు తీర్పును తప్పు పట్టేలా మాట్లాడాడు. మళ్లీ సుప్రీంలో రివ్యూకు వెళితే కర్రు కాల్చి వాత పెట్టింది. 40 ఏళ్లలో స్వార్థం తప్ప హుందాతనాన్ని అలవర్చుకోలేదు’ అని విమర్శల వర్షం కురిపించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
YSRCP
Telugudesam
Vijay Sai Reddy
Twitter

More Telugu News