తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై అనేక ఫిర్యాదులు అందాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులు నిజమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సివిల్ సప్లయిస్ అధికారులు ఎప్పటికప్పుడు మార్కెట్లను తనిఖీ చేయాలని, రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.