రంజాన్ మాసం ప్రారంభం..ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

  • ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసం రంజాన్
  • దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం
  • తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు శుభాకాంక్షలు
ముస్లిం మతస్థుల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం మతస్థులు జరుపుకుంటారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. మహనీయుడు మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది ఈ మాసంలోనే కావడంతో ఈ నెలకు అంత ప్రాముఖ్యత నిస్తారని అన్నారు. ‘రంజాన్’ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండగ అని అన్నారు.
Go Back to Shorts
ramadan
YSRCP
ys
jagan
Ap
Telangana

More Telugu News