అంబటి రాయుడికి వరల్డ్ కప్ చాన్స్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబటి రాయుడికి వరల్డ్ కప్ చాన్స్?

  • కేదార్ జాదవ్ కు గాయం
  • ఐపీఎల్ నుంచి దూరం
  • మరికొన్నిరోజుల్లోనే వరల్డ్ కప్
ఎంతో ప్రతిభ ఉన్నా అదృష్టం ముఖం చాటేయడంతో వరల్డ్ కప్ లో ఆడే చాన్స్ రాని అంబటి రాయుడి ముంగిట మరో అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ కప్ కు ఎంపికైన కేదార్ జాదవ్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. అతడి గాయం తీవ్రత దృష్ట్యా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు పక్కనబెట్టాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఎక్స్-రే టెస్టులో గాయం బలమైనదే అని తెలుస్తున్నా, మరోసారి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు.

ఇక జాదవ్ ను జట్టులోకి తీసుకోబోమని, వరల్డ్ కప్ కు అతను ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉందని ఫ్లెమింగ్ చెబుతున్నా, మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జాదవ్ కోలుకుని ఫిట్ నెస్ నిరూపించుకోవడం మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో, జాదవ్ అన్ ఫిట్ గా తేలితే స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో ఉన్న అంబటి రాయుడు, రిషభ్ పంత్ లలో ఒకరికి చాన్స్ వస్తుంది.

అయితే, ధోనీ, దినేశ్ కార్తీక్ రూపంలో ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. ఇప్పుడు రాయుడు, పంత్ కూడా ఇద్దరూ వికెట్ కీపర్లే అయినా, రాయుడికి అన్యాయం జరిగిందన్న భావన అటు మాజీ క్రికెటర్లు, కొందరు సెలక్టర్లలో కనిపిస్తోంది. పంత్ ది చిన్నవయసే కావడంతో అతడికి తర్వాతైనా అవకాశాలు వస్తాయని, రాయుడికి అవకాశం ఇవ్వాలనుకుంటే అందుకు ఇదే మంచి తరుణం అని అన్నివైపుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Cricket

More Telugu News