గుంటూరు శివారులోని చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం
- మొత్తం ఐదు గోదాముల్లో రెండింట మంటలు
- ఘటనా స్థలికి చేరుకున్న ఆరు అగ్నిమాపక శకటాలు
- మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది
గుంటూరులో ఉన్న మూడు అధునాత అగ్నిమాపక యంత్రాలతోపాటు తెనాలి, చిలకలూరి పేటలో ఉన్న మరో మూడు యంత్రాలతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శకటాల్లోని నీరు సరిపోక పోవడంతో గోదాము యాజమాన్యం ట్యాంకర్లతో తెప్పించిన నీటిని చిమ్ముతున్నారు.
మిగిలిన మూడు గోదాములకు మంటలు విస్తరించకుండా చూస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాకున్నా ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.