పసుపు కండువాతో పోలింగ్ కేంద్రంలోకి గల్లా జయదేవ్.. అభ్యంతరం వ్యక్తంచేసిన వైసీపీ!
- గుంటూరు వెస్ట్ లోని నల్లచెరువులో ఘటన
- పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన గల్లా
- అభ్యంతరం వ్యక్తంచేసిన వైసీపీ ఏజెంట్ సుధాకర్
అయితే గల్లా జయదేవ్ పసుపు కండువాతో రావడంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని సూచించారు. అయితే వాటిని పట్టించుకోని గల్లా జయదేవ్, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చెలరేగింది.