13 వేల కోట్ల వసూళ్లకు దగ్గరలో 'అవెంజర్స్ ఎండ్ గేమ్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

13 వేల కోట్ల వసూళ్లకు దగ్గరలో 'అవెంజర్స్ ఎండ్ గేమ్'

  • వసూళ్ల పరంగా దూసుకుపోతోన్న 'అవెంజర్స్ ఎండ్ గేమ్'
  • త్వరలో 'స్టార్ వార్స్' వసూళ్లను అధిగమించే ఛాన్స్ 
  • తెలుగులో 400 కోట్ల క్లబ్ దిశగా పరుగులు  
వేసవి సెలవుల్లో థియేటర్స్ కి వచ్చిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్' అన్నివర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయా భాషల్లో .. ఆయా ప్రాంతాల్లో వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. 'అవతార్' రికార్డులను బద్దలు కొట్టాలనే పట్టుదలతో పరుగులు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 'అవతార్' 19,321 కోట్లను వసూలు చేసింది. వసూళ్ల పరంగా ఆ తరువాత స్థానంలో 'స్టార్ వార్స్' వుంది.

ఇప్పటికే 12,590 కోట్లను వసూలు చేసిన 'అవెంజర్స్  ఎండ్ గేమ్' .. ఈ వారాంతంలో 'స్టార్ వార్స్' రికార్డును అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఇండియా బాక్సాఫీస్ దగ్గర తొలిరోజునే 50 కోట్లను రాబట్టిన ఈ సినిమా, ఐదో రోజు నాటికి 200 కోట్లు .. 10వ రోజు నాటికి 300 కోట్లను కొల్లగొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా 400 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తున్నట్టుగా చెబుతున్నారు.
avengers and game

More Telugu News