మ్యాచ్ జరుగుతుందో, లేదో తెలియదు.. కానీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి!
- జూన్ 16న ఇండియా-పాక్ మ్యాచ్
- ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
- 48 గంటల్లో టికెట్లన్నీ అమ్మకం
మరోవైపు, పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్లు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీంతో, ఈ మ్యాచ్ జరుగుతుందో, లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ, క్రికెట్ ప్రేమికులు మాత్రం దీన్నేమీ పట్టించుకోకుండా... టికెట్లను సొంతం చేసుకున్నారు.