విమానం ల్యాండింగ్‌లో ప్రమాదం.. 41 మంది దుర్మరణం
- టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం
- అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన పైలట్లు
- నేలను బలంగా ఢీకొని మంటలు
ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలుపుకుని 78 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 41 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఆరుగురు గాయపడ్డారని అధికారులు వివరించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.