దేశంలో రేపు ఐదో విడత పోలింగ్... అన్ని ఏర్పాట్లు పూర్తి
- 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో పోలింగ్
- సోనియా, రాహుల్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ పోలింగ్
- అందరి దృష్టి అటువైపే
అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో 7, మధ్యప్రదేశ్ లో 7, బీహార్ లో 5, ఝార్ఖండ్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 2 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రముఖులు బరిలో ఉండడంతో పలు నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.