కళ్లెదుటే పరాయి మహిళలతో చాటింగ్...భర్త వక్రబుద్ధిని గమనించి నిలదీసిన భార్య
- తప్పుచేస్తూ వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయిన మహిళ
- పోలీసులకు ఫిర్యాదు
- ప్రేమించి పెళ్లి చేసుకున్నవిజయవాడకు చెందిన జంట
దీన్ని గమనించిన విజయ నిర్మల, భర్తను పలుమార్లు నిలదీసింది. ఈ వ్యతిరేకతను తట్టుకోలేకపోయిన దినేష్ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. దినేష్ చెడు తిరుగుళ్లు తిరుగుతున్న విషయాన్ని అత్త, ఆడ పడచుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు కూడా అతనికే వత్తాసు పలికారు.
ఇక చేసేది లేక తనే స్వయంగా దినేష్ను నిలదీసింది. ఆమెను కొట్టి పుట్టింటికి పంపించేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ విజయ నిర్మల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదుచేసి భర్త, అత్తతోపాటు ఇద్దరు ఆడపడుచులపై కేసు నమోదు చేశారు.