గ్రూప్-2 పరీక్షకు సిద్ధమైన ఏపీ యువతి.. కరెంట్ షాక్ రూపంలో కబళించిన మృత్యువు!
- ఆంధ్రాలోని విశాఖపట్నంలో ఘటన
- గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న కోమలి
- బాత్రూమ్ లో కరెంట్ షాక్ తో దుర్మరణం
అక్కడ స్విచ్ఛ్ లను ఆఫ్ చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలింది. నేల తడిగా ఉండటం, గోడల్లో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో కోమలి అక్కడే పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే కోమలి అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.