సుజనా గ్రూప్ టాక్స్ కన్సల్టెంట్ అరెస్ట్... విషయం తెలియక హైకోర్టును ఆశ్రయించిన భార్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుజనా గ్రూప్ టాక్స్ కన్సల్టెంట్ అరెస్ట్... విషయం తెలియక హైకోర్టును ఆశ్రయించిన భార్య!

  • నిన్న హైకోర్టును ఆశ్రయించిన అయ్యంగార్ భార్య
  • జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ చేశామన్న అధికారులు
  • పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
తన భర్త ఇంటికి రాలేదన్న భయంతో సుజనా గ్రూప్ టాక్స్ కన్సల్టెంట్ అయ్యంగార్ భార్య, తన భర్త కనిపించడం లేదని హైకోర్టులో పిటిషన్ వేయగా, పోలీసులు అసలు విషయం చెప్పడంతో, న్యాయమూర్తి పిటిషన్ ను కొట్టేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని సుజనా గ్రూప్ ఎగ్గొట్టిందని, ఈ కేసులో అయ్యంగార్ ను అరెస్ట్ చేశామని అధికారులు హైకోర్టుకు తెలిపారు. అయ్యంగార్ సతీమణి వేసిన పిటిషన్ ను శనివారం రాత్రి విచారించిన హైకోర్టు న్యాయమూర్తి, అధికారుల సమాధానాన్ని వినగానే పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా సుజనా గ్రూప్ లోని కంపెనీలపై సీబీఐ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Sujana Chowdary
Ayangar
High Court

More Telugu News