మళ్లీ పెరిగిన 'పెట్రో' ధరలు!

  • గత కొన్ని రోజులుగా మారని పెట్రోలు, డీజిల్ ధరలు
  • పెట్రోలుపై 7 పైసల ధర పెంపు
  • డీజిల్ పై 8 పైసల వరకూ వడ్డన
గత కొన్ని రోజులుగా మారకుండా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా, లీటరు పెట్రోలుపై 7 పైసలు, డీజిల్ పై 6 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో ఢిల్లీలో లీటరు ధర రూ.73.13కు, డీజిల్‌ ధర రూ.66.71కు చేరింది. ఇదే సమయంలో కోల్‌ కతా, ముంబై నగరాల్లో లీటరు పెట్రోలుపై 7 పైసలు, చెన్నైలో 8 పైసల మేరకు పెరిగింది. డీజిల్‌ ధర లీటరుకు 9 పైసలు చొప్పున పెరిగింది. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు మొదలైన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి.
Go Back to Shorts
Petrol
Price
Hike
Diesel

More Telugu News