అల్లు అర్జున్, సుకుమార్ సినిమా లాంచ్ డేట్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్, సుకుమార్ సినిమా లాంచ్ డేట్?

  • త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ 
  • తరువాత సినిమా సుకుమార్ తో
  • ఈ నెల 11వ తేదీన ఈ ప్రాజెక్టు లాంచ్
'రంగస్థలం' సినిమాతో సుకుమార్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా చేయడానికి  సుకుమార్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథపైనే సుకుమార్ కసరత్తు చేస్తున్నాడట.

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఆ తరువాత సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసే సినిమా షూటింగు పూర్తయిన తరువాత, సుకుమార్ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. గతంలో సుకుమార్ తో అల్లు అర్జున్, 'ఆర్య' .. 'ఆర్య 2' చేసిన సంగతి తెలిసిందే.
allu arjun
sukumar

More Telugu News