హిమాలయాల్లో కూడా పంజా విసురుతున్న ఫణి తుపాను
- హిమాలయాల్లో భీకర గాలులు
- ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఎగిరిపోయిన టెంట్లు
- టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన నేపాల్ ప్రభుత్వం
బలమైన గాలుల వల్ల కొన్ని టెంట్లు ఎగిరిపోయాయనే సమాచారం అందిందని, అయితే పర్వతారోహకులు, సపోర్ట్ స్టాఫ్ అందరూ క్షేమంగానే ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖకు అనుబంధంగా ఉండే పర్వతారోహక విభాగం డైరెక్టర్ ఆచార్య తెలిపారు. పరిస్థితి మెరుగుపడేంత వరకు అందరూ సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండిపోవాలని కోరారు.
నేపాల్ పై తుపాను ప్రభావం నేరుగా లేకపోయినప్పటికీ... అక్కడి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా నేపాల్ తూర్పు ప్రాంతంలోని వాతావరణం మార్పుకు గురవుతోంది. విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో, హెలికాప్టర్ ప్రయాణాలను కూడా నిషేధించారు.