Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెరపై కనిపించాలని నేను అప్పట్లో అనుకోలేదు: దర్శకుడు కె. విశ్వనాథ్

  • చాలామంది దర్శకులు తెరపై కనిపించారు
  • అప్పట్లో దర్శకత్వంపైనే దృష్టి ఉండేది 
  • నటన గురించి అప్పట్లో ఆలోచన చేయలేదు
తెలుగు తెరపై ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ఏరుకుంటూ వెళితే, వాటిలో కె. విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్నో కళాత్మక చిత్రాలను అందిస్తూ వచ్చిన ఆయన, ఆ తరువాత కాలంలో నటుడిగాను మారారు. తను ధరించిన పాత్రలకి జీవం పోశారు. దాంతో ఆయన ఎందుకని ఇంతకాలంగా నటుడిగా ట్రై చేయలేదని అభిమానులు అనుకున్నారు.

తాజా ఇంటర్వ్యూలో విశ్వనాథ్ ఆ విషయాన్ని గురించి ప్రస్తావించారు. "అసలు నటుడిని కావాలనే ఆలోచన నాకు ఎప్పుడూ కలగలేదు. నటన పట్ల నాకు ముందు నుంచి ఆసక్తే వుంటే, ఏదో ఒక సినిమాలో ఎక్కడో అక్కడ ఒక చిన్న వేషమైనా వేసేవాడిని. తెరపై కనిపించాలనే ఆసక్తితో చిన్న పాత్రల్లో మెరిసిన దర్శకులు చాలా మందే వున్నారు. అలాంటి ఆసక్తి .. ఆలోచన నాకు లేకపోవడం వలన అప్పట్లో నేను నటనపై దృష్టిపెట్టలేదు. నా దృష్టి ఎప్పుడూ కూడా దర్శకత్వంపైనే ఉండేది" అని చెప్పుకొచ్చారు. 
k vishwanadh

More Telugu News