పెళ్లి సందడిలో అదుపుతప్పిన టాటా ఏస్‌ వాహనం.. ఒకరి మృతి

  • మరో ఇద్దరికి గాయాలు
  • ఆగివున్న వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించిన బాలుడు
  • బ్యాండ్ బృందంపైకి దూసుకుపోయిన వాహనం
డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఓ బాలుడి ఆకతాయి తనం మరో బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి. ఆగివున్న టాటా ఏస్‌ వాహనాన్ని నడిపే ప్రయత్నంలో అది అదుపుతప్పి దూసుకు పోవడంతో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు...సికింద్రాబాద్‌ వారాసిగూడలో గురువారం అర్ధరాత్రి ఓ పెళ్లి బృందం ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది.

అదే సమయంలో ఓ టాటా ఏస్‌ వాహనం వచ్చి అక్కడ ఆగింది. డ్రైవర్‌ ఇంజిన్‌ ఆన్‌లోనే ఉంచి ఏదో కొనేందుకు సమీపంలోని పాన్‌షాప్‌లోకి వెళ్లాడు. దీన్ని గమనించిన ఓ బాలుడు సరదాతో వాహనంలోకి ఎక్కి హ్యాండ్ బ్రేక్ తీసి, ఏక్సిలేటర్‌పై కాలు వేయడంతో బండి ముందుకు దూసుకుపోయింది. ఆ సమయానికి వాహనం ముందు బ్యాండ్‌ బృందం ఉండడంతో వారిని ఢీకొట్టుకుంటూ వాహనం వెళ్లింది.

ఈ హఠాత్పరిణామంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వాహనం ముగ్గురి పైనుంచి దూసుకు వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
secundarabad
marriage
Road Accident
one dead

More Telugu News